తెలంగాణ

తాళ్ల రాంపూర్‌లో వైభవంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి అలంకరణతొమ్మిదో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

తాళ్ల రాంపూర్‌లో వైభవంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి అలంకరణతొమ్మిదో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

జనం న్యూస్, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిషా సురమర్దిని అమ్మవారిని తొమ్మిదో అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించారు. వివిధ పుష్పమాలలు, రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించిన అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అలంకరణ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.

ఇ-పేపర్