
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 20 ఇటీవల జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్నాధపురం వాసి శ్రీముక్కర అశోక్ ని తర్లుపాడు మండల పరిషత్ ఆఫీసులో అధికారుల సమక్షంలో తర్లుపాడు మండలంలో గెలుపొందిన ఎంపీటీసీ లందరూ ముక్కర అచ్చయ్య అలియాస్ అశోక్ గారిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్, మరియు లయన్స్ క్లబ్ మార్కాపురం అధ్యక్షులు కశెట్టి జగన్ ఎంపీపీ శ్రీ ముక్కర అశోక్ గారిని శాలువా దండలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముక్కర అశోక్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలు అందించే వారిని తెలియజేశారు. అంతేకాకుండా ఎంతోమందికి దానధర్మాలు చేశారు. తన సహాయం కోరి వచ్చిన వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందించారు. ఎప్పుడు మనకు చేతనైన సహాయం చేయాలని అంటూ సమాజానికి తనకు చేతనైన సహాయం అందిస్తున్నాడు. కానీ తను చేసిన గొప్ప పనులు ఎవరికి చెప్పుకొనే అలవాటు అశోక్ గారికి లేదు.అలాంటి మంచి మనసున్న వ్యక్తి తర్లుపాడు మండలానికి ఎంపీపీగా రావడం శుభ సూచకం. మండలంలో పలు రకాల సమస్యలు తెలియజేస్తూ మీ పాలనలో అభివృద్ధి బాగా చేయాలని, శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేయాలని ఎంపీపీ గారికి సూచన చేయడం జరిగింది. మండలంలో మౌలిక వసతులు అలాగే ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు నా సేవలు కొన్ని గ్రామాల వరకే తెలుసు. ఇప్పటినుండి ప్రజలతో మమేకమై మండలంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి అభివృద్ధిపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తానని తెలియజేశారు. అలాగే మొదట మా గ్రామ పాఠశాల అభివృద్ధికి పాటుపడి తర్వాత మిగతా పాఠశాలలపై దృష్టి పెడతానని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్ ఎంపీపీ గారిని సన్మానించి, స్వీటు తినిపించారు. ఈ కార్యక్రమంలో ముక్కర కాశయ్య, ముక్కర గాలెయ్య, ఉపాధ్యాయిని M.అనూష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.