
మద్నూర్ సెప్టెంబర్ 17 జనం న్యూస్ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మద్నూర్ తహసీల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజా పాలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పాలన అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అధికారులు, సిబ్బంది అందరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన జరిగింది. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, డి. టి ఖలీద్, శివ రామకృష్ణ, గిర్దావర్ మురళీధర్, ASO దత్తు, జూనియర్ అసిస్టెంట్లు రవి, బాలరాజు, దశరథ్, ప్రవీణ్, GPO లు సత్యం, దినకర్ , సంతోష్, నర్సింలు, అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దర్సవర్ సాయిలు, గ్రామ పెద్ద సంతోష్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.