
జనం న్యూస్ సంగారెడ్డి, అక్టోబర్ 19:తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనదొడ్డి నరసింహ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనదొడ్డి నరసింహ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన బాధ్యత నూతన జిల్లా అధ్యక్షుడిపై ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని నాయకులు ఆకాంక్షించారు.నియామక పత్రం అందుకున్న సందర్భంగా కొనదొడ్డి నరసింహకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు