
జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ ఈ రోజు ఉదయ్ అసోసియేషన్ తెలంగాణ దివ్యాంగ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ ని యస్ ఆర్ డి ఎక్స్టెన్షన్ జీవో ను జారీ చేసినందుకు సెక్రటేరియట్లో కలిసి ధన్యవాదాలు తెలుపుతూనే టీజీపీఎస్సీ గురుకుల ట్రాన్స్కో జెన్కో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, జిహెచ్ఎంసి పోలీస్ శాఖ వంటి పెద్ద డిపార్ట్మెంట్ లలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీలను తక్షణమే గుర్తించి దివ్యాంగులచే భర్తీ చేసేటట్టు మినిస్టర్ ద్వారా సెక్రటరీ కి మరియు దివ్యాంగుల డైరెక్టర్ కి ఆదేశాలు జారి చేయమని కోరాము అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ బ్యాక్లాగ్ ఖాళీలను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు మినిస్టర్ ద్వారా జారీ చేయమని ఉదయ్ అసోసియేషన్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థని తగ్గించాలని దీనికి అనుగుణంగా దివ్యాంగుల రోస్టర్ పాయింట్ పదిలోపు మార్చాలని అలాగే ఉద్యోగ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన మినిస్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ఉదయ్ అసోసియేషన్ కోరింది.అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సెక్రటరీ మరియు డైరెక్టర్ కు అలాగే జిల్లా కలెక్టర్లు కు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పడం జరిగింది, దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్ పెంపు రోస్టర్ పాయింట్ల గురించి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రాష్ట్ర సీఎం కి వివరిస్తానని చెప్పడం జరిగింది ఇట్లు ఉదయ్ అసోసియేషన్, తెలంగాణ.