

జనం న్యూస్ సెప్టెంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధాని 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తోటపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ శిబిరాన్ని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి,సేవా సంకల్ప్ జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి సతీష్,మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గానాల కల్యాణ్,ప్రధాన కార్యదర్శి,మండల కన్వీనర్ తోలేటి సూర్య గంగాధర్ సందర్శించారు.వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రత్నసుధను దుశ్శాలువాతో సత్కరించారు.గ్రామీణులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని,ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సతీష్ కోరారు.ఈ శిబిరంలో ఎంఎల్హెచ్పీ రేభకా,ఏఎన్ఎం సుబ్బలక్ష్మి,హెల్త్ విజిటర్ వరలక్ష్మి,హెల్త్ అసిస్టెంట్ శ్రీను,ఆరోగ్య,అంగన్వాడీ సిబ్బంది,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.