
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు రూ.20 వేల ఆర్థిక సహాయం
జనం న్యూస్, అక్టోబర్ 12, జగిత్యాల జిల్లా, మెట్పల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి విలేకరికి మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు అండగా నిలిచారు. మానవత్వంతో స్పందించి ఆయన కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసి తమ ఐక్యతను చాటుకున్నారు.మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్ అనారోగ్యానికి గురై నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు సోమవారం ఆసుపత్రికి వెళ్లి విజయ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ వంతు సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.తోటి జర్నలిస్టు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆయనకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు సభ్యులు తెలిపారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూరం సంజీవ్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫ్రోజ్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.