
జనం న్యూస్ 18-06-2026 : తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సిర్గాపూర్ మండలానికి చెందిన అబ్దుల్ జబ్బార్ను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ధృవపత్రం (సర్టిఫికేట్)తో పాటు అధికారిక ఐడీ కార్డు మరియు హెల్త్ కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో TYJF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తాటికొండ వెంకటేశం, రాష్ట్ర కోశాధికారి యాల్ మమత, ఆర్గనైజేషన్ సెక్రటరీ జగత్ కృష్ణ, ఉద్యమకారుడు బీరయ్య యాదవ్, తెలంగాణ యువజన సంఘం అధ్యక్షుడు కూన వేణుగోపాల్, మున్సిపల్ వాయిస్ చైర్మన్ చిట్టిబాబు, పలువురు విలేకరులు మరియు TYJF సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే సంస్థ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడీ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అబ్దుల్ జబ్బార్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సంస్థ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.అబ్దుల్ జబ్బార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన TYJF రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం సేవలందిస్తానని పేర్కొన్నారు.