
జనం న్యూస్ 16-06-2025 తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TYJF) నిరంతర కృషి ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించే దిశగా కీలక ముందడుగు పడింది. వివిధ జర్నలిస్టు సంఘాల వినతుల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి జిల్లాలోని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలకు ప్రత్యేక లేఖ జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు సాధ్యమైనంత మేర ఉచిత విద్య అందించాలని పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలను కోరారు. జర్నలిస్టు సమాజానికి ప్రోత్సాహకంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా TYJF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్, విద్యాశాఖ కు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం TYJF ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని TYJF నాయకులు కోరారు.