
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశంజహీరాబాద్, సెప్టెంబర్ 20:శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన నగర సంకీర్తన ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది. పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర మందిరంలో 225 వ నగర సంకీర్తనలో భాగంగా హరేకృష్ణ మహామంత్ర జపం, ప్రభుపాదుల ప్రార్థన గీతం తో ప్రారంభమైన సంకీర్తన రస రమ్య కీర్తనలతో కొనసాగింది. రాధాదేవి, శ్రీకృష్ణులను కొలుస్తూ ఆలపించిన గీతాలు ఆహుతులను ఆకట్టు కున్నాయి. భక్తులు కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అలరించారు. నర్సింహా ప్రణామంతో ముగిసిన ఈరోజు కార్యక్రమం లో సంకీర్తన కు చెందిన భక్తులతో పాటు పద్మశాలి యువజన సంఘం సభ్యులు, మార్కండేశ్వర వీధి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.