
జనం న్యూస్ | సెప్టెంబర్ 17 | జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు జరుపుకున్నారు.వేద పండితుడు మణిదీప్ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడిని సృష్టి, నిర్మాణం, శిల్పకళ, వృత్తి నైపుణ్యాలకు ప్రతీకగా భక్తులు స్మరించుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పనిముట్లు, యంత్రాలు, వృత్తికి సంబంధించిన పరికరాలను పూజించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో కనపర్తి సురేష్, నరేష్, బెజ్జరాపు శ్రీనివాస్, శ్రీకాంత్, నాంపల్లి వెంకటాద్రి గణేష్, కోటగిరి శ్రీనివాస్, వెంకటస్వామి, అశోక్, స్వామి, కిరణ్, నూనె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.