
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కళ్యాణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం గ్రామంలో అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం అంగన్వాడీ సెక్టార్ 48వ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా సంకల్పం అభయాన్ జిల్లా ఇంచార్జి నాగిరెడ్డి సతీష్ రావు, బీజేవైఎం కోనసీమ జిల్లా ఇంచార్జి చిట్రా పాపారావు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు,రూరల్ మండల అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ, పట్టణ అధ్యక్షులు దునే శ్రీనివాస్, కూటమి నాయకులు గందం ఉమా, పెద్దిరెడ్డి దొరబాబు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.