
జనం న్యూస్ సెప్టెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి ములుగు జిల్లా కేంద్రం లో మహర్షి డిగ్రీ కళాశాలను అర్థాంతరంగా ఎత్తివేయడం తో మొదటి రెండవ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఫైనల్ ఇయర్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినారు అడ్మిషన్ గడువు దగ్గర పడుతుండటం తో ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యం మీయొక్క మొదరి రెండవ సంవత్సరం చదివిన టీ సి సంబంధిత సర్టిఫికెట్స్ తీసుకు రావాలని విద్యార్థులను ఒత్తిడి తేవడం తో విద్యార్థులు మహర్షి డిగ్రీ కళాశాల యాజమాన్యం ను ఒకటికి రెండు సార్లు కలిసి స్కాలర్ షిప్ లు పడగానే ఫీజులు చెల్లిస్తామని టీ సి లు సర్టిఫికెట్స్ ఇవ్వాలని మొర పెట్టుకున్నపట్టికీ ఇవ్వడానికే అసలు ఒప్పుకోకుండా ఫీజుల డబ్బులు కట్టితేనే ఇస్తామని క్లియర్గా చెప్పడం తో కళాశాలలో చేరేముంది మీరు ఫీజులు కట్టవలసిన పని లేదని స్కాలర్ షిప్ లు పడగానే మేము తీసుకుంటామని మద్యలో కళాశాల మూసి వేసి ఇప్పుడూ డబ్బులు కట్టాలని ఒత్తిడి తేవడం తో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఆందోళన చెందు తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు రఘుపతి మాట్లాడుతూ మహర్షి డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇప్పటికైన విద్యార్థులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపి విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేయుటకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వాలని తెలియజేశారు...