
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్
జనం న్యూస్ నవంబర్ 4 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా అక్టోబర్ నెల 26,27, 28, తేదీలలో జరిగిన ఇంటర్ సర్కిల్. ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, వారు యాదగిరిగుట్ట లో నిర్వహించినటువంటి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కు, బీబీపేట మండల, రాష్ట్రస్థాయి కళాకారులతోపాటు, కామారెడ్డి సర్కిల్ కు చెందినటువంటి, అనేకమంది రాష్ట్ర కళాకారులు కళాకారునిలు పాల్గొనడం జరిగింది. ఇట్టి రాష్ట్రస్థాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నటువంటి విజేతలకు కామారెడ్డి సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ విజేతలకు ఘనంగా శాలువాలతో పుష్ప గుచ్చాలతో. మంగళవారం రోజు నాడు. తన కార్యాలయంలో.ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి సన్మాన కార్యక్రమంలో కామారెడ్డి సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ సాల్య నాయక్, మాట్లాడుతూ. బీబీపేట మండల రాష్ట్ర కళాకారులతో పాటు. కామారెడ్డి వివిధ మండలాలకు చెందిన కళాకారులను అభినందిస్తూనే. కామారెడ్డి సర్కిల్ యొక్క పేరు ప్రఖ్యాతులను ఉన్నత శిఖరాలను తీసుకెళ్లినందుకు కళాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ, విద్యుత్తు రంగానికి సేవలు చేస్తూనే రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందిన కళాకారులను తాను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్పోర్ట్స్ ఉమ్మడి జిల్లా అథారిటీ ఆఫీసర్. గోపి, బద్రి అనిల్ మాట్లాడుతూ. కామారెడ్డి సర్కిల్ కు పేరు తెచ్చినటువంటి కళాకారునిలకు, కళాకారులకు. అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు. రాష్ట్ర కళాకారులు నాంపల్లి మాట్లాడుతూ. కలా స్ఫూర్తిని నింపినటువంటి, ఉమ్మడి జిల్లా స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ . గోపి కి, బద్రి, అనిల్ ఎస్ ఈ, డి ఈ.లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్స్, గోపి.బద్రి అనిల్. రాష్ట్ర కళాకారులు. ఎం నాంపల్లి. టి స్వామి. ప్రత్యేక జూలీ అవార్డు అందుకున్న, మహిళ కళాకారులు. వివిధ యూనియన్ల నాయకులు. కళాకారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది.