
దివ్యాంగుల హామీలు వెంటనే అమలు చేయాలిగజ్జి శంకర్*
జనం న్యూస్ సెప్టెంబరు 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీక అని తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ అన్నారు.ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి అమరులను స్మరించుకున్నారు.అనంతరం శంకర్ మాట్లాడుతూ అమరుల త్యాగాల స్ఫూర్తితో దివ్యాంగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులైన దివ్యాంగులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హామీల అమలులో జాప్యం చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతిరెడ్డి, చింతల రమేష్,రఘుపతిరెడ్డి, రాజోతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు....