
జనం న్యూస్ సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మండల పరిధిలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, కాట్రేనికోన తహసీల్దార్ వి.రవి కిరణ్, ఎస్ఐ వి.సత్యనారాయణ సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ పర్యవేక్షణలో ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిటీలు పాటించాల్సిన ముఖ్య సూచనలు: విగ్రహ ఏర్పాటుకు పోలీసు, విద్యుత్, ఫైర్ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి. ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలి. విద్యుత్, జనరేటర్ల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలి, ఫైర్ సేఫ్టీకు మార్గం ఉంచాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టే పాటలు, ప్రసంగాలు నిషేధం. డీజే సౌండ్ పరిమితి, సమయపాలన తప్పనిసరి. ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాల వద్ద అధిక శబ్దం చేయరాదు. ఊరేగింపు, నిమజ్జనానికి ముందే పోలీసులకు మార్గం, సమయం తెలిపి అనుమతి పొందాలి. పోలీసులు నిర్ణయించిన నిమజ్జన పాయింట్ లోనే నిమజ్జనం చేయాలి. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు ఉంటాయి. అందరూ సహకరించి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.