
జనం న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు భక్తిశ్రద్ధలతో సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వర మహారాజును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.ఈ సందర్భంగా కూకట్ పల్లి లోని బజరంగ్ వినాయక భక్త బృందం, టీం బజరంగ్దళ్, శ్రీ సాయి మారుతి యూత్ అసోసియేషన్, బాల గణేష్ యూత్ అసోసియేషన్,రామాలయం యూత్ అసోసియేషన్, శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్, టీం విజ్ఞహారత, టీం బ్లాక్ లిస్ట్, వెంకట్రావునగర్ వెల్ఫేర్ అసోసియేషన్, దేవిస్థాన్ విల్లాస్, వడ్డేపల్లి ఎనక్లేవ్, దేవి నగర్ పోచమ్మ టెంపుల్, ప్రకాష్నగర్లోని విఘ్నరాజా వెల్ఫేర్ అసోసియేషన్, కూకట్పల్లి హెల్ రాకర్స్ యూత్ అసోసియేషన్, దయార్గూడలోని గణేష్ మండపం, ఫిరోజ్గూడలోని ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రాజేశ్వరరావు సందర్శించారు.మండపాల వద్ద భక్తులు, నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన రాజేశ్వరరావు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదా ఆటంకం కలగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.గణేష్ మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. “గణేష్ మహారాజ్కి జై”, “జై శ్రీరామ్” నినాదాలతో మండపాల పరిసరాలు మార్మోగాయి. భక్తులతో కలిసి రాజేశ్వరరావు ఉత్సాహంగా గణనాథుని ఆశీర్వాదాలు పొందారు.గణపతి బప్పా మోరియా... మంగళమూర్తి మోరియా!