
జనం న్యూస్ — సెప్టెంబర్ 19 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి: వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల ను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిమజ్జన ఊరేగింపులు సజావుగా సాగడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నట్లు కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప వెల్లడించారు. ఐడీఎల్ ట్యాంక్ రోడ్డులో ఆంక్షలుఐడీఎల్ చెరువు ప్రవేశద్వారం నుంచి రెయిన్బో విస్టా వరకు ఉన్న ఐడీఎల్ ట్యాంక్ రోడ్డును సాధారణ వాహనాల రాకపోకలకు మూసివేయ నున్నారు. ఈ మార్గంలో వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.కూకట్పల్లి వై జంక్షన్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను జేఎన్టీయూ, ఫోరం మాల్, హైటెక్ సిటీ మీదుగా మాదాపూర్ వైపు మళ్లించనున్నారు.అదేవిధంగా హైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌పేట్ ప్రాంతాల నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లక్కీ రెస్టారెంట్ సిగ్నల్, కేపీహెచ్‌బీ నాలుగో దశ, రోడ్డు నంబర్ 1, రెమెడీ ఆసుపత్రి మలుపు మీదుగా కూకట్పల్లి వై జంక్షన్‌కు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.మరో ప్రత్యామ్నాయ మార్గంహైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌పేట్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు కైత్లాపూర్ వంతెన, అంజయ్యనగర్ కూడలి, మూసాపేట, వసుంధర ఆసుపత్రి మీదుగా కూకట్పల్లి వై జంక్షన్‌కు చేరుకునే మార్గాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రైవేటు ప్రయాణ బస్సులపై కూడా ఆంక్షలునిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో మియాపూర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా హైదరాబాద్ నగరం వైపు వెళ్లే ప్రైవేటు ప్రయాణ బస్సుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు.అలాగే మియాపూర్ నుంచి హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా వెళ్లే బస్సులు, బీహెచ్ఈఎల్ కూడలి నుంచి హెచ్‌సీయూ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బస్సులకు కూడా ఆంక్షలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. బీహెచ్ఈఎల్–పటాన్చెరు–బయటి వలయ రహదారి మార్గాన్ని వినియోగించుకోవాలని ప్రైవేటు ప్రయాణ బస్సుల నిర్వాహకులకు సూచించారు.ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అమలు చేసే ట్రాఫిక్ ఆంక్షలను ప్రజలు గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.