
జనం న్యూస్ సెప్టెంబర్ 18తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డివివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధిలో రామకృష్ణ సంక్షేమ సంఘం, గణేష్ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బాలబాలికలతో ఘనంగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని ఆరాధించారు.ఈ సందర్భంగా రామకృష్ణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులందరూ విద్యలో రాణించి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారులపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, పూజలో పాల్గొన్న భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ చూపారు. పూజా ఏర్పాట్లలో మహిళా సోదరీమణులు ఎంతో శ్రమించి ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించడంపై జనంపల్లి పురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంచందర్ రావు, లక్ష్మీనారాయణ, చంగల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సుధాకర్, శ్రీనివాస్ రావుతో పాటు గణేష్ యువజన కమిటీ సభ్యులు నందు, అశ్విత్, భార్గవ్, రోహిత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. బాలబాలికల తల్లిదండ్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.