

జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. పీఎం శ్రీ ట్విన్నిoగ్ స్కూల్స్ లో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలను ఎంపీపీ ఎస్ కొండాపూర్ మరియు తూంపల్లి విద్యార్థులు ఎంఈఓ రాములు. ఆదేశాల మేరకు సందర్శించి పాఠశాలలోని గణితశాస్త్ర,రసాయన శాస్త్ర,భౌతిక శాస్త్ర, బొటాని,జువాలజీ,సాంఘిక,భాషా శాస్త్రల మరియు కంప్యూటర్,వ్యవసాయ వృత్తి విద్య కు సంబంధించిన ప్రయోగశాలలను ప్రత్యక్షంగా వీక్షించి వారి తరగతికి సంబంధించిన వివిధ ప్రయోగాల గురించి సంబంధిత ఉపాధ్యాయుల ద్వారా సంక్షిప్తంగా తెలుసుకొవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఇరు పాఠశాల విద్యార్థులు కలిసి నేర్చుకోవడం,చర్చించుకోవడం ఒక మంచి అవకాశం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి సంతోష్,రామ్ చందర్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గోనడం జరిగింది.