

జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలోని ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించారు.అదేవిధంగా మునగాల రెవిన్యూ పరిధిలోని బరాకత్ గూడెం నుండి కృష్ణానగర్ వెళ్లే దారిలో ఆర్ట్ 9 లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ప్రాథమిక సర్వే జరుగుతున్న ఏరియాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మునగాల తహసిల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, మండల సర్వేయర్ సరిత, భాస్కర్ ఇతర సిబ్బంది మరియు స్థానిక పట్టాదారులు పాల్గొన్నారు.
