Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 11 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో ఆర్.ఆర్. మ్యాన్ పవర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.మ్యాన్ పవర్ సెంటర్ నుండి ఎవరికైనా సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్స్, హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ ను ఏర్పాటు చేయుట ఈ సమస్థ యొక్క ప్రత్యేకత. మార్కాపురం లాంటి పట్టణంలో ఇలాంటి సమస్త ఏర్పాటు చేయడం అభినందనీయం.ఈ సందర్భంగా ఆర్.ఆర్ మ్యాన్ పవర్ సర్వీస్ కు శుభాకాంక్షలు.. అగ్ని దినపత్రిక అధినేత రామకృష్ణ శనివారం అగ్ని దినపత్రిక కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆర్.ఆర్ మ్యాన్ పవర్ ఎండి పల్లెబోయిన అరవింద్, మేనేజర్ సాజారావు రామారావు, అగ్ని న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ నాగార్జున లతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా అగ్ని అధినేత రామకృష్ణ మాట్లాడుతూ విశ్వసనీయతో ఈ సంస్థ సిబ్బంది పనిచేసి సమస్త కు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. ఆర్.ఆర్ మ్యాన్ పవర్ లాంటి సంస్థ మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.