

(జనం న్యూస్)మార్చి6 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్ :- మేజర్ గ్రామపంచాయతీ కల్లూరు మాజీ సర్పంచ్ కల్లూరు మండల మాజీ జడ్పిటిసి డాక్టర్ లక్కినేని రఘుని ఏఐసీసీ క్రైస్తవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పిఎన్ఆర్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవ నాయకులు ఆయన స్వగృహంలో ప్రమర్శించారు. ఇటీవల కంటి శస్త్ర చికిత్స చేయించుకొని తమ నివాస గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ జడ్పిటిసి డాక్టర్ లక్కినేని రఘును బుధవారం క్రైస్తవ సంఘ నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో యధావిధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన అనేక క్రైస్తవ కార్యక్రమాలలో వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ రాష్ట్ర నాయకులు రెవరెండ్ పి ఏనోశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎ సి సి మండల కమిటీ అధ్యక్షులు షాలువాలతో ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ధర్నాసి బాలరాజు, మండల అధ్యక్షులు పాస్టర్ పి ఎబినేజర్, ఉపాధ్యక్షులు పాస్టర్ పి దయాకర్, ప్రధాన కార్యదర్శి పాస్టర్ ఎంజాన్ పరంజ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పాస్టర్ ఆధురి రాజశేఖర్, కోశాధికారి స్టీఫెన్ పాల్ తదితర పాస్టర్లతో పాటుగా బంజారా నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బానోతు కృష్ణ పాల్గొన్నారు