Listen to this article

జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, కేసులు రాజి కుదుర్చుకునేందుకు ఈ నెల 8వ తేదీన జిల్లాలోని కోర్టులలో న్యాయ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్న ట్లు పరిగి డి ఎస్ పి శ్రీనివాస్ తెలిపారు. ఇ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ రాజి మార్గమే రాజా మార్గమని, రాజి పడితే ఇద్దరు గెలిచి నట్లు అని, రాజి పడదగ్గ కేసులన్నీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అవుతాయని, రాజి అన్నిటికంటే ఉత్తమమైన మార్గమని పరిగి డిఎస్పీ అన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.