

జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 19న విజయవాడలో జరుగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రంగరాజు, కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. స్థానిక అమర్ భవన్‌లో బుధవారం కరపత్రాలు ఆవిష్కరించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కదం తొక్కాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారాయుడు, మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి, నాయకులు పాల్గ్‌న్నారు.