Listen to this article

జనం న్యూస్, మార్చి 5: మలికిపురం డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం, కొన్ని సెంటర్లలో అర్హత లేని రక్త పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని, కొన్ని కేంద్రాలలో సరైన ప్రమాణాలతో ఫలితాలు ఇవ్వడం లేదని జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేష్ ఆరోపించారు. కొంతమంది స్థానిక వైద్యులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని విమర్శించారు. వైద్యులు కమిషన్ లకు కక్కుర్తి పడి టెస్టలు వ్రాస్తున్నారని 60% వైద్యులకు చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఎమ్ ఎల్ టి, డి ఎం ఎల్ టి కోర్సులు చేసిన టెక్నీషియన్స్ స్థానే అర్హత లేని వారిచే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆరోపణలు వినిపిస్తున్నాయని, వెంటనే సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, రెన్యువల్ కానీ వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.