

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్)
భవన కార్మికులకు మీటింగ్ స్థలాన్ని కోరుతూ మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కలిసి ప్రెసిడెంట్ కర్రి తాతారావు శనివారం వినతిపత్రం అందజేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ ను కలిసి తమ విన్నపాన్ని తెలియజేశారు.భవన కార్మికులైన తాపీ మేస్త్రిలు,పెయింటింగ్ పనివారు, ఎలక్ట్రీషియన్స్, టైల్స్ మేస్త్రులతో సుమారు 150 మందితో ప్రతి నెల ఒకటవ తేదీన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని దానికి తగిన స్థలాన్ని ప్రభుత్వ సహకారంతో అందించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ప్రెసెంట్ బేరా దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గంటి చంద్రశేఖర్ సెక్రటరీ లంక చందు కాకరపర్తి శ్రీను బండి సోమరాజు తదితరులు పాల్గొన్నారు