

నవతెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్…
జనం న్యూస్ // మార్చ్ // 6//జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 647 సర్వే నెంబర్లు గల భూమిని గురుకుల పాఠశాలకు కేటాయించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది.. జమ్మికుంట పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ మాట్లాడుతూ.. అనంతరం 1980లో అప్పటి ప్రభుత్వం జమ్మికుంట గ్రామపంచాయతీ పాలకవర్గం విద్యార్థుల భవిష్యత్తు ను గుర్తుపెట్టుకుని రేపటి తరానికి ఒక మంచి విద్యార్థులు ఉండాలని భావించి అప్పటి సర్పంచ్ కృష్ణంరాజు, మరియు పాలకవర్గం శ్రీనివాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాంతారావు కి 35 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ తో రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు.కానీ దురదృష్టవశాత్తు కాంతారావు మరణించినాక శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల మూసివేయడం జరిగింది. అని తెలిపారు.ఇది అదునుగా చూస్తూనే గత ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మున్సిపాలిటీ నాయకులు ప్రభుత్వం తమది అని భావించి ఖాళీగా ఉన్నటువంటి ఆ భూమిని క్రయవిక్రయాలు చేయడం జరిగింది అని వివరించారు.విద్యార్థి సంఘాలుగా మేము పలుమార్లు రెవెన్యూ మరియు మున్సిపాలిటీలో దరఖాస్తు పెట్టడం ద్వారా ఆ భూమి దొంగల చేతులకు పోకుండా ఆగింది, అని మళ్లీ తిరిగి ఇప్పుడు ఆ భూమిని కొనుగోలు అమ్మకాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అని మాట్లాడారు.ఈ భూమిని కలెక్టర్, ఎంక్వయిరీ నిమిత్తం సంబంధిత అధికారుల కేటాయించి ఆ భూమిని కాపాడి ఆ స్థలంలో గురుకుల పాఠశాల కానీ వసతి గృహాలకు గాని కేటాయించాలని కోరారు.