Listen to this article

జనం న్యూస్ 06 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ ముగ్గురు చిన్నారులు రెండు నెలల కాల వ్యవధిలోనే భార్యాభర్తల మరణంతో ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు. పిల్లలకు తోడుగా ముగ్గురు ముసలి వాళ్లు ఉండడం ఇంకా బాధాకరమైన విషయం. విరాలలోకి వెలితే.. జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం, చర్ల గార్లపాడు గ్రామంలో 16-1-2025 నాడు ఈ పిల్లల తల్లి అకాల మరణం చెందింది. ఇంట్లో ఎంతో కొంత కూలి నాలి చేసుకొని చురుకుగా పనిచేసి ముసలి వాళ్లను, పిల్లలను పోషించే మహా తల్లి ఆ ఇంటి ఆడదిక్కు కోల్పోవడంతో భర్త కుమ్మరి వీరేష్ ధైర్యాన్ని కోల్పోయాడు. మానసికంగా ఆలోచిస్తూ పిల్లల భవిష్యత్తు ముసలి వాళ్ళకు సేవ ఎలా చేయాలంటూ దీనస్థితిలో తన ఆర్థిక పరిస్థితులను పదేపదే నెమరు వేసుకొని అతను ఏమీ చేయలేనని డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అటు ధైర్యం చెప్పే వారు లేక ఇతరులను సహాయ సహకారాలు అడగలేక పురుగుల మందు తాగి 28-02-2025 శుక్రవారం రోజున మరణించడం జరిగింది. దీనితో వాళ్ళ కుటుంబంలో చెప్పలేని విషాద ఛాయలు అల్లుకున్నాయి. సమాజంలో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచించి ముగ్గురు పిల్లలకు ముగ్గురు ముసలి వాళ్లకు కనీసం వాళ్ళ నిత్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము వాళ్లకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తే ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం అని సదుద్దేశంతో ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మనకు తోచిన సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలబడి అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులకు ధైర్యం చెప్పే విధంగా ప్రోత్సహించాలని ఇట్టి విషయాన్ని BRK న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు అయిన నేను సోషల్ మీడియా ద్వారా మరియు మానవసేవే మాధవసేవ గ్రూప్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది… దాతలు సహకరించవలసిన ఈ నెంబర్ కు ఫోన్ పే ద్వారా 9985352790 ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటూ …BRK న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు, జోగులాంబ గద్వాల జిల్లా.