

జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయంలో కోదాడ అగ్నిమాపక సిబ్బంది వారు విద్యార్థులకు అగ్నిప్రమాదాల పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది విద్యార్థులకు అగ్రి ప్రమాదాల నివారణ మరియు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు… విద్యార్థులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
