

జనం న్యూస్ -ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీకి హిల్ కాలనీకి చెందిన మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ ఆదర్శ ఉన్నత పాఠశాల మరియు హిల్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా మహారాజుల సంఘం సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో (పే బ్యాక్ టు సొసైటీ) అనే నినాదంతో పేద విద్యార్థులకు ఎంతో కొంత సహకారం అందించాలని లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో మహారాజుల సేవా సంఘం అధ్యక్షులు జి బద్రి, ఉపాధ్యక్షులు కే పుల్లారావు, కార్యదర్శి ఆర్ వీరబాబు, కోశాధికారి కె నకులరావు, సభ్యులు శ్రీనివాస్, శశిధర్, మోహన్, శివ, గోరంట్ల శివరామ ప్రసాద్, నాగరాజు, గోపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం శేషు, రాజాబాబు, నాగ పద్మ, సుధారాణి, శ్రీదేవి, రవీందర్, రామిరెడ్డి, బక్కయ్యలు పాల్గొన్నారు.