Listen to this article

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు: జనం న్యూస్,మార్చి06, అచ్యుతాపురం:మండలం లోని నునపర్తి గ్రామంలో గల సర్వే నెంబర్ 93 గ్రామ కంఠం స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శికి మరియు ఎంపీడీఓకి సుమారు పదిహేను రోజుల క్రితం గ్రామస్తులు పిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని గ్రామ సర్పంచ్ చుక్క అనురాధ ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓ రాంబాబుకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సమస్య పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తానని తెలిపారు.