

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం మండలంలోని చెన్నకేశవపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఆర్ సి పి వర్క్ సైట్ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ వి. వి.అప్పారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పొలాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేందుకు లింకు రోడ్ ల పనులు చేపట్టాలని తెలిపారు. కూలీలతో మాట్లాడుతూ చేసిన పనికి తగిన వేతనం అందుతుందా లేదా అని, పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. వారి వెంట ఎంపీడీవో దాసరి సంజీవయ్య, ఈసీ శ్రీను, ఉపాధి సిబ్బంది యన్ విజయ్,ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి అన్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అంబేద్కర్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.