

జనం న్యూస్ జనవరి 13(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది, ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన అనంతపురం జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మరియు ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరాం రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు, మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తో కలిసి పనిచేయడం నాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, రానున్న లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు