

జనం న్యూస్ 08మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) యస్.సి.వర్గీకరణను గ్రూప్ -A -1%, గ్రూప్ -B-9%, గ్రూప్ -C-5% ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డా.షమీమ్ వర్గీకరణ నీవేదికను రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లోనే చట్టం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్. మాదిగల,ఉప కులాల జీవితకాల సమస్యకు శాశ్విత పరిస్కారం చూపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మాదిగ సమాజం జీవితాంతం ఋణపడి ఉంటది. మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ :- మోదుగు జోగారావు కొత్తగూడెం( )రామాఆంజనేయకాలనీ,చుంచుపల్లి 06:- ఈరోజు కొత్తగూడెంలో మాదిగ జే.ఏ.సి.ముఖ్యనాయకుల సమావేశంలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు మాట్లాడుతూ 3 దశబ్దాల 59 కులాల యస్.సి.వర్గీకరణ సమస్యకు సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి యస్.సి.వర్గీకరణకు శాశ్వత పరిస్కారం చూపాలని,ఏక సభ్య కమీషన్ జస్టిష్ డా.షమీమ్ అక్తర్ ను వేసి,సమగ్ర విచారణ చేసి,శాస్త్రియ పద్దతిలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 విభజించి యస్.సి.వర్గీకరణ ను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3 కి 5% ఇచ్చిన షమీమ్ కు,రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు,ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో యస్.సి.వర్గీకరణ చట్టం అయ్యే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.గ్రూప్ 1,గ్రూప్ 2,గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీలో వెంటనే ఈ యస్.సి.వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.గ్రూప్ 4 ఉద్యోగాల నియమాకాలలో మిగిలి పోయిన 1200 పోస్టులకు వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. యస్.సి.వర్గీకరణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగలు జీవితాంతం ఋణపడి ఉంటారని తెలిపినారు. యస్.సి.వర్గీకరణ కోసం కృషి చేసిన మంతివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.ఈ సమావేశంలో మాదిగ జే.ఏ.సి.నాయకులు కె.నరేష్,పంది.రాజు,కుక్కల.వెంకట్,గోలి.శ్రీను,మంద.మనోజ్,రాజేష్ తదితరులు పాలుగోన్నారు