

ఏజెన్సీ ప్రజల వెన్నంటివుండేది కమ్యూనిస్టు పార్టీనే గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి జరుగుతోంది
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జనం న్యూస్ 08మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి నిధి కురిమెల్ల శంకర్ ) లక్ష్మీదేవిపల్లి : మండలపరిధిలోని రేగళ్ల, పెద్దతండా గ్రామాలకు చెందిన యాభై కుటుంబాలవారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సమక్షంలో సీపీలో చేరారు. వీరికి ఎర్ర కండువా కప్పి పార్టీలోని అహ్వాహించిన అనంతరం ప్రాధమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మారుమూల ఏజెన్సీ గ్రామాలపై ప్రేత్యేక ద్రుష్టి సారించి అభివృద్ధి పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికె వివిధ పథకాల్లో మంజూరైన నిధులతో అంతర్గ రోడ్లు, గ్రామీణ ప్రధాన రహదారులు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించారని, పెండింగులో వున్నపనులకు త్వరలో మంజూరి లభిస్తుందని తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు ప్రారంబించాలని కూనంనేని అధికారులను ఆదేశించారని తెలిపారు. కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు అండగా ఉండి వారిపక్షాన అనేక పోరాటాలు నిర్వహించింది కమ్యూనిస్టు పార్టీనేనని, గిరిజనుల సాగులో ప్రతి ఎకరాకు హక్కులు కల్పించడమే లక్ష్యంగా పోరాడి హక్కును సాధించి పెట్టామన్నారు. ఇండ్లు లేని పేదలకు పక్కాగృహాలు, అర్హులైన ప్రతి కుంటుంబానికి ప్రభుత్వ సంక్షేప పథకాలు అందేవరకు కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందన్నారు. పార్టీలో చేరినవారిలో బరపటి రాంబాబు, ముక్కెర రమేష్, ముక్కెర రాంప్రసాద్, తూనెం సతీష్, రామగిరి గోపి, నన్య, మహంకాళి సందీప్, బాలిన రాజు, మాడెం బాలకృష్ణ, బానోత్ కిషన్, ధారావత్ మంగ్య,భానోత్ విఠల్, ధారావత్ శివ, భూక్య వీరన్న, భూక్యా వెంకటేష్, గంగరబోయిన వీరబాబు, సిక్కుల సాగర్, మేకల వెంకటేష్,భానోత్ నాగరాజు, భానోత్ గణేష్, భానోత్ దేవా, మేకల ప్రభయ్య,బానోత్ శత్రు, మేకల రాజబాబు,మేకల ఎల్లయ్య,పెద్ద బొమ్మ ప్రసాద్, లకావత్ మురళి, భుక్యా సుమన్, భూక్య రామదాస్, బుక్యా కిషన్, భూక్య రమేష్, నూనవత్ నర్సింగ్ తదితరులున్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మండల నాయకులు దీటి లక్ష్మి పతి, కంటెం శ్రీనివాస్, మిర్యాల రాము, ఎర్రయ్య, దేవరగట్ల రాంబాబు, మాడెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.