Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మహిళా చట్టాల పరిరక్షణ కొరకై కృషి చేయాలని కొరిసపాడు ప్రాజెక్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి అద్దంకి కృష్ణకుమారి పేర్కొన్నారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకుని శుక్రవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టి ఐ మహిళ శిశు సంక్షేమ శాఖ, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మలన సమీకృత వ్యూహం (దిశా) దాట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో అద్దంకి రూరల్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బి సుధాకర్ రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళలు అభివృద్ధి చెందిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని మహిళల పట్ల బాలికల పట్ల వివక్షత చూపించకూడదని పేర్కొన్నారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి.సాగర్ మాట్లాడుతూ మహిళలు విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో రాణించాలని వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మహిళలు ఆర్థికంగా ఎదిగినట్లయితే ఆ సమాజం ఉన్నత స్థాయికి వెళుతుందని ఆ కుటుంబం ఆర్థిక తారతమ్యాలు నిరుపేద తనం లేకుండా ముందుకు సాగుతుందని మహిళలపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడంలో మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలని మహిళలు బాలికల కోసం ఏ చట్టాలు అయితే రూపొందించారు అది వరకు చేరువే విధంగా వాటిపై వారికి అవగాహన కలిగించే విధంగా ఉండాలని మానవ అక్రమ రవాణా బాలల అక్రమ రవాణా నిర్మలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలలపై లైంగిక దాడులు నిర్మూలన కొరకు కృషి చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని ఎక్కడైతే మహిళలు గౌరవించబడుతుందో అక్కడ సమాజం గౌరవించబడుతుందని ఆ కుటుంబం గురించి పడుతుందని నేటి మహిళలు అనేక రంగాల్లో పురుషులు కంటే అత్యధికంగా రాణిస్తున్నారని ఇటువంటి వారిని మిగతా మహిళలు స్ఫూర్తిగా తీసుకుని వారు జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని పేర్కొన్నారు,ఏపిఎం గాయత్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేక మహిళను గుర్తించడం కాదని మహిళలల పాత్ర కుటుంబంలో సమాజంలో చాలా కీలకమైనదని వారికి అన్ని రంగాల్లో తగిన గుర్తింపుచు ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆడపిపిల్లలు అనే వివక్షత చూపించి చిన్న వయసులోనే చాలామంది తల్లిదండ్రులు బాలికలు వివాహాలు చేస్తున్నారని ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళల కోసం నిరంతరం మంచి సేవలు అందిస్తూ కృషి చేస్తున్న అద్దంకి మండలం తిమ్మాయపాలెం ఎలిమెంటరీ స్కూల్ ఉత్తమఉపాధ్యాయురాలు కే రామలక్ష్మి మరో ఉత్తమ ఉపాధ్యాయురాలు ఎస్ నాగ మల్లికా సిడిపిఓ అద్దంకి కృష్ణకుమారి, మండల విద్యాశాఖ అధికారి బి సుధాకర్ రావు, హెల్త్ సూచన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఏ. పి ఎం కె గాయత్రి అంగన్వాడీ కార్యకర్త ఏ విషయలక్ష్మి మహిళల హక్కుల పరిరక్షణ కోసం మహిళల అభివృద్ధి కోసం కొన్ని దశాబ్దాలపైగా నిస్వార్థ సేవ అందిస్తున్న సందర్భంగా దీన్ని సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయాలతో సాగు చేసిన పంటలతో వివిధ రకాల పౌష్టికాహారంల తినుబండారాల స్టాల్ ను ఏర్పాటు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ రూరల్ ఐసిడి సూపర్వైజర్లు ఏ. ఇందిరా ఏ అరుణాదేవి, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టి ఐ ప్రోగ్రాం మేనేజర్ డి సి హెచ్ కోటేశ్వరరావు, ఏఎన్ ఎం రాధా అవుట్చ్ వర్కర్లు ఏం సామ్రాజ్యం, వీ.కరుణ పి ఈ లు మల్లేశ్వరి పార్వతి శివ పార్వతి అద్దంకి ప్రభుత్వ బాలిక పాఠశాల విద్యార్థినులు, అద్దంకి రూరల్ మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు