

జనం న్యూస్ -మార్చి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లుగా బ్యాంకు మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ బ్రాంచ్ పరిధిలో సమ భావన మహిళా సంఘాలకు చెందిన లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసి అందజేసినట్లుగా తెలిపారు, నాగార్జునసాగర్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో బ్యాంకుకు వచ్చిన మహిళా ఖాతాదారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు, ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రాము నాయక్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ సూపర్వైజర్ కమలమ్మ, హెల్త్ అసిస్టెంట్ గంగాబాయి, బ్యాంకు మహిళ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.