Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండలంలోని( ఏం ఇ ఓ )ఆఫీస్ లో జమ్మికుంట మండలంలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను హేమలత (ఎం ఈ ఓ )ఘనంగా సన్మానించడం జరిగింది.అంతేకాకుండా మహిళల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడేలా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మహిళలు తయారు కావాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు , అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు కూడా పాల్గొన్నారు.ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న (ఎంఈఓ )ని ఉపాధ్యాయ సంఘ నాయకులు అభినందించారు. అలాగే ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానిచ్చారు.