Listen to this article

గ్రామపంచాయతీ కార్మికులకు జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి

మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చల కూర స్వరాజ్యం

జనం న్యూస్ మార్చి 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గ్రామ పంచాయితీ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.శుక్రవారం ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేస్తామని అందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు.వెంటనే ఇచ్చిన హామీల ను అమలు చేయాలని డిమాండ్ చేస్తు గ్రామపంచాయతీ కార్మికులకు జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి రెండు నెలలు గడిచిన ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు పనిలో వెసులుబాటు కల్పించి ఒక్క పూట పనులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయి సెండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బండారు గురవమ్మ ,యల్ నాగార్జున, ఎం ఎంకన్న, పి నరసయ్య, ఎం ముత్తయ్య, డి రవి, బి సైదాలు, రాజు, ఎం వీరయ్య, బి పరుశరాములు, యస్ రఘు, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.