

జనం న్యూస్ మార్చి 7 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల బీరుపూ పాఠశాలలో ఉపాధ్యాయురాలకు, మరియు వంట సిబ్బందికి, స్కావెంజర్ కు ప్రోత్సహించి గౌరవప్రదంగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జూపాక సుదర్శన్ మాట్లాడుతూ సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యత గొప్పదనం మహిళల చదువు, బాధ్యతలు అన్ని రంగాలలో విజయం సాధించడం గురించి విద్యార్థులకు అవగాహన చేశారు, అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సముద్రాల శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జూపాక సుదర్శన్, ఉపాధ్యాయురాలు ఏం. రమాదేవి, భోగ నాగరాణి ,బి .స్వరూప, బి .లలిత బి. మౌనిక, వంట సిబ్బంది మల్లవ్వ ,లక్ష్మమ్మ మరియు స్కావెంజర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.