Listen to this article

రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్

మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పెస్ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ

ఎల్ఆర్ఎస్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ

జనం న్యూస్, మార్చి 08, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఎల్.ఆర్.ఎస్ ను నిబంధనల ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ అన్నారు.శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.ఎల్ఆర్ఎస్ పై సమీక్షిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ 2020 క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. లేఔట్ క్రమబద్ధీకరణ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు తో పాటు ప్రో- రాటా ఓపెన్ స్పెస్ చార్జి లను మార్చి 31 లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని అన్నారు. నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్.టి.ఎల్, చెరువులు కుంటలు తదితర ప్రాంతాలలో లేని ప్లాట్ల కు ఆటోమేటిక్ గా ఎల్ఆర్ఎస్ కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం రెవెన్యూ నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరిగా చేయాలని అన్నారు.ఎల్ఆర్ఎస్ అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులు 90% రిఫండ్ అవుతుందని, 10 శాతం ప్రాసెసింగ్ కోసం తీసుకుంటామని అన్నారు ‌. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారికి అర్హత ఉంటే స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అన్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10% ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణీత నమూనాలో జిల్లా ,మండలం ,గ్రామం, సర్వే నెంబర్ విస్తీర్ణం, లేఔట్ లోని మొత్తం ప్లాట్లు క్రయ ,విక్రయ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్లు సంవత్సరం వంటి అనేక వివరాలతో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు.మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా వాట్స్ అప్ గ్రూపులు తయారు చేసి ప్రతి దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డిపిఓ వీర బుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్, డి ఎల్ పి ఓ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.