

జనం న్యూస్ మార్చి 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఎస్ వెంకట చలం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో సచివాలయ సిబ్బందిచే పి 4 సర్వే ప్రారంభించడం జరిగిందని ఎంపీడీవో ఎస్ వెంకటాచలం శనివారం తెలిపారు. ఇంటికి సంబంధించి మొత్తం 27 ప్రశ్నలతో రూపొందించిన ప్రస్నాపత్రం ద్వారా ఆన్లైన్ లో సమాచారాన్ని సేకరించి ఆన్లైన్ ద్వారా నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని తామచెరువు గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు కార్యక్రమంలో కాట్రేనికోన పంచాయతీ కార్యదర్శి జె వి వి సత్యనారాయణ, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి పి సాగర్, పంచాయతీ సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు