

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవానికి సుమారు వందేళ్ళ చరిత్ర ఉందని మిత్ర సర్వీస్ సభ్యులు అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కందిమళ్ల జయమ్మ కు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్వీస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల సాధన కోసం,తక్కువ పని గంటలు, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. దీంతో అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ వారి డిమాండ్లను ఒప్పుకొని 1909 వ సంవత్సరంలో మహిళా దినోత్సవంగా ప్రకటించింది.1910లో కోపెన్ హగన్ సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారిక హోదా కల్పించారు.1911లో ఆస్ట్రేలియా, డెన్మార్క్ జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో అధికారికంగా నిర్వహించారు.1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సెలవు దినంగా ప్రకటించింది.1917లో రష్యాలో మహిళలు ఆహారం, శాంతి హక్కుల కోసం నిరసనకు దిగారు. అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వీడతారు. మహిళలు సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం కావడంతో గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీ రావడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా రూపాంతరం చెందిందని తెలిపారు. సేవలకు సత్కారం చేయడంపై సంతోషిస్తున్నాను: డాక్టర్ కందిమళ్ల జయమ్మ. ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థను నెలకొల్పి ఎందరో మహిళలకు కుట్టు మిషన్లు నేర్పించి స్వశక్తితో ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్నామని, పేద, బడుగు బలహీన, వర్గాల విద్యార్థులకు ఫీజులు అందిస్తున్నామని, వృద్ధుల కోసం మురికిపూడి గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం పడుతున్నామని,వికలాంగులకు ట్రై సైకిళ్లుఅందిస్తున్నామని తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న సేవలను మెచ్చి చేస్తున్న సత్కారం పై సంతోషిస్తున్నానని, మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యదర్శి కరణం విజయలక్ష్మి, కందిమళ్ల నారాయణమూర్తి, మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.