Listen to this article

ప్రపంచ మహిళా దినోత్సవం జనం న్యూస్ 08 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మాట్లాడుతూ.. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మహిళలు కూడా వారికాలపైన వాళ్ళు నిలబడి జీవనం కొనసాగించాలని ప్రభుత్వాలనుండి కూడా వారికి సహాయ సహకారాలు ఉంటాయని, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాకేష్ గ్రామ సెక్రెటరీ బుచ్చయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నాగవర్ధన్, గ్రామ కారోబార్ జంగయ్య, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, మహిళ సంఘాల సభ్యురాలు, మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.