

జనం న్యూస్ మార్చి 8 పఠాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని రమేశ్వరం బండ గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా దినోత్సవం సందర్బంగా మాజీ సర్పంవ్ ధరణి అంతిరెడ్డి, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి, ఈవో జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు శాలువాలతో సన్మానం చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింటిలోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారనీ, పురుషులకు దీటుగా చదువులలో రాణిస్తూ క్రీడా రంగంలో, nపోలీసు వ్యవస్థలో, ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ కండక్టర్లుగా, సాఫ్ట్వేర్ విధులు నిర్వహిస్తూ స్వతహాగా విదేశాలలో చదువు కోసం వెళ్లి ఉన్నత స్థాయిలో తిరిగి వస్తున్న మహిళలు ముందుకు వెళ్తున్నారని రామేశ్వరం బండ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి, బాలరాజు గౌడ్, గడ్డమీది ఆంజనేయులు, ఇబ్బు, గణేష్, గ్రామ పెద్దలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.