

జనం న్యూస్ మార్చ్ 08 జిల్లా బ్యూరో పేదరికాన్ని జయించడానికి చదువోక్కటే ఆయుధమని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇంద్రవెల్లి మండలం ధనోర బి జడ్పీఎస్ఎస్ పదవ తరగతి విద్యార్థులకు శనివారం ప్యాడ్లు అందజేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..పేదరికాన్ని జయించడానికి చదువు ఒక్కటే ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యలను ఏర్పరుచుకొని శ్రద్దగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని,పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు సన్నదం కావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగయ్య సామజిక సేవకులు అతీష్ కుమార్, లింగాపూర్ గ్రామ ,పెద్దలు శ్రీరంగ్ దేవ్ కతే గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కాత్లే పృథ్వీ రాజ్, సోయం సతీష్ మురళి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు
