Listen to this article

జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ నందు పనిచేస్తున్న మహిళా పంచాయతీ కార్మికులను ఎంపీఓ విజయ్ కుమారి, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, పాఠశాలల్లో వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు స్వర్ణకుమారి, కొండలమ్మ, శకుంతల, సవిత, కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి, సునీత,లక్ష్మమ్మ, పంచాయతీ సిబ్బంది, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.