Listen to this article

జనం న్యూస్ మార్చి 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండలం పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధ ఆశ్రమంలో శనివారం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మునగాల మండల మహిళ అధ్యక్షురాలు తాళ్లూరి ఉషారాణి కేక్ కట్ చేసిన అనంతరం అనాధాశ్రమం లో ఉన్న అనాధలకు మాతృ సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, మహిళా అధ్యక్షురాలు తాళ్లూరి ఉషారాణి మాట్లాడుతూ…మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడినప్పుడే చరిత్రను మార్చిన వారు అవుతారని అన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా దినోత్సవం అంటే ముందుగా గుర్తొచ్చేది అమ్మ అని, అమ్మను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మహిళా శక్తి గురించి మాటలు, పాటలు, పద్యాల రూపంలో చెప్పటం చాలా ఎమోషనల్ ఉన్నదని ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మను గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ రోజుల్లో మహిళలు అని రంగాలలో ముందు ఉన్నారని వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, పారిశ్రామిక , వ్యాపార రంగాలలో, కళలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం జరిగిందని అలాగే రాజ్యాంగంలో కూడ మహిళలకు ఫండమెంటల్ రూల్స్, మహిళల హక్కులు చట్టాలు రూపొందించి మహిళలకు సముచిత స్థానం కల్పించారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాశి నాగర్జున, రమాదేవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పూసోజు పద్మ, వెలుద వెంకటప్ప చారి, చండూరి జయప్రద, మోత్కూరు సమాచారం, అన్నపూర్ణమ్మ, బిక్షువమ్మ, రమ్య, నాగరాజు, బంగారపు శ్రీనివాస్,కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.