

జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 పైగా మహిళల కు 3000/- రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగా చేసి (హీమోగ్లోబిన్ పరీక్ష, షుగర్ పరీక్ష, బి పి, ఎముకల సాంద్రత పరీక్ష (బీఎండ్ )
మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా.ముషం ప్రణీత ఏం ఎస్ ) గైనకాలజిస్ట్, గర్భిణీ స్త్రీలకు మరియు ఇతర మహిళలను పరీక్షించి సలహాలు సూచనలు చేశారు.డా. ఊడుగుల అనిత ఏం ఎస్ , జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్, స్త్రీల యొక్క అనేక రకాల సమస్యలకు పరీక్షించి సలహాలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డా ముషం సురేష్ ఏంఎస్ ఎముకల వైద్య నిపుణులు, డా కిషోర్ కుమార్ ఎండీ , ఛాతి వైద్య నిపుణులు, డా ఉదుగుల సురేష్ ఎండీ , జనరల్ ఫిజీషియన్& క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
